తెలంగాణ కాంగ్రెస్‌లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రేపుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రేపుతోంది. వర్గీకరణకు వ్యతిరేకంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాలల సింహా గర్జన సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండిపడ్డారు. వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో వర్గీకరణ ఐఎన్‌సీ మద్దతు ఉందని గతంలో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఉన్నప్పుడే మద్దతు ప్రకటించరని తాజగా అసెంబ్లీలో కుడా ముఖ్యమంత్రి వర్గీకరణకు మద్దతు తెలిపారని సంపత్ తెలిపారు. గడ్డం వివేక్‌పై పీసీసీకి ఫిర్యాదు చేశామన్నారు. అటు ఒక్క సభ పెట్టుకుంటే గాయిగాయి చేస్తున్నారని సంపత్‌పై వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోరుతున్న మాదిగలది ధర్మ పోరాటమని, దాన్ని వ్యతిరేకిస్తున్న వారిది స్వార్థమని ఎమ్మా ర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
ఫిబ్రవరి 7న హైద రాబాదులో నిర్వహించ తలపెట్టిన మా దిగల ‘లక్ష డప్పులు వేల గొంతులు’ సభకు సన్నద్దం అవుతున్నారు. వర్గీకరణకు మాలలు తప్ప ఎస్సీల్లోని 57 ఉప కులా లు అనుకూలంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తప్ప రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, కులాలు, సామాజిక సంఘాలు ఎమ్మార్పీఎస్ పోరాటాలకు అండగా నిలుస్తూ ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నాయని మందకృష్ణ తెలిపారు. కాంగ్రెస్ కేంద్ర అధి ష్టానంతో పాటు రాష్ట్రంలో రాజకీయంగా ఉన్నత స్థానంలో రెండు మాల కుటుంబాలు ఎస్పీ వర్గీకరణకు అడ్డుకుంటాయని ఆరో పించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అసెంబ్లీ సాక్షి గా స్వాగతించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదని మందకృష్ణ అన్నారు. ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా మాదిగలు రోడెక్కే పరిస్థితి వచ్చిందన్నారు
SC classification,Congress Party,Mandakrishna Madiga,Former MLA Sampath Kumar,MLA Gaddam vivek,MRPS,CM Revanth reddy,A million drums and a thousand voices