2025-01-23 13:47:59.0
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అనారోగ్యం పాలయ్యారు.
https://www.teluguglobal.com/h-upload/2025/01/23/1397133-rahul-gandhi.webp
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాలతో ఆయన నేడు ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్నిరద్దు చేసుకున్నారు. ఢిల్లీలోని ముస్తఫాబాద్ లో రాహుల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా వైద్యుల సూచన మేరకు ఈ ప్రచార సభ రద్దైందని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ పేర్కొన్నారు. రేపు షెడ్యూల్ ప్రకారం మాదిపూర్ లో ఎన్నికల ర్యాలీ జరుగుతుందని చెప్పారు. భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించే అవకాశం ఉందని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని… ఒంటరిగానే పోటీ చేస్తున్నామని చెప్పారు.
రిపబ్లిక్ డే తర్వాత రాహుల్, ప్రియాంక సహా ఇతర నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తారని తెలిపారు. దీంతో ముస్లిం ఓటర్ల విభజనకు కారణం కాకుండా రాహుల్ గాంధీ ఆప్‌కు సహకరిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ దీనిని ఖండించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము సొంతంగానే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. రిపబ్లిక్ డే తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా ఇతర పార్టీ నేతలు ఢిల్లీలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తారని చెప్పారు.
Rahul Gandhi,Congress Party,ill,Devender Yadav,Delhi Assembly Elections,Mustafabad,Muslim electorate,Priyanka Gandhi,CM Revanth reddy,Sonia Gandhi