కాంగ్రెస్‌ అధ్యక్షుడితో స్పీకర్‌ భేటీ

2024-09-24 13:57:31.0

మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసి గడ్డం ప్రసాద్‌ కుమార్‌

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న స్పీకర్‌ మంగళవారం సాయంత్రం ఖర్గే నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని స్పీకర్‌ కలిశారు. తన నియోజకవర్గంలో చేపట్టాల్సిన నేషనల్‌ హైవేలు, ఇతర పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు.

 

AICC,Chief Kharge,Telangana,Speaker,Gaddam Prasad Kumar,Delhi Tour