2024-11-02 04:11:09.0
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి కాంగ్రెస్ లేఖ
https://www.teluguglobal.com/h-upload/2024/11/02/1374295-congress-vs-ec.webp
హర్యానా అసెంబ్లీ ఎన్నికల అంశంపై ఎన్నికల సంఘం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొన్నిరోజులుగా కొనసాగుతున్నది. తమ పార్టీని ఉద్దేశించి ఈసీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మరో లేఖ రాసింది. తటస్థులను పూర్తిగా పక్కనపెట్టడమే లక్ష్యమైతే ఆ విషయంలో ఎన్నికల సంఘం అద్భుతంగా పనిచేస్తున్నట్లే కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.
ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయగా.. ఈసీ తోసిపుచ్చింది. అనుకూల పలితాలు రానప్పుడు నిరాధారమైన ఆరోపణలు చేయడం హస్తం పార్టీకి అలవాటేనని విమర్శించింది. ఇలాంటి పనికి మాలిన ధోరణిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఈసీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. ఈసీ తనకు తాను క్లీన్ చీట్ ఇచ్చుకోవడం తమను ఆశ్చర్యపరచలేదని, అయితే సమాధానం ఇచ్చిన తీరు, వాడిన భాష , తమ పార్టీపై చేసిన ఆరోపణల వల్లనే మళ్లీ లేఖ రాయాల్సి వచ్చిందని కాంగ్రెస్ తెలిపింది. ఈసీ ఇదే తరహా భాష ఉపయోగిస్తే అలాంటి భాష కట్టడి కోసం కోర్టుకు వెళ్లడం మినహా తమకు మరో మార్గం లేదని కాంగ్రెస్ పేర్కొన్నది.
Congress,Election Commission,Haryana poll results,EVMs,Legal recourse