2024-10-12 10:10:33.0
మోదీని ఓడిచేందుకు మహారాష్ట్రలో చేతిలో చెయ్యేసి నడిచేందుకు సై
https://www.teluguglobal.com/h-upload/2024/10/12/1368420-asaduddin-owaisi.webp
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన రాజకీయ అడుగులు ఆ పార్టీ వైపు వేస్తోన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.. హస్తం పార్టీతో పొత్తుకు సై అంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు జట్టుకట్టబోతున్నాయా? అని అనుకుంటున్నారు.. ఈ పొత్తు ముచ్చట తెలంగాణకు సంబంధించినది కాదు.. అవును! మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు ఒవైసీ ఆసక్తి చూపిస్తున్నారు. నరేంద్రమోదీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అందరితో కలువాలని సూచిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఆయన లేఖ కూడా రాశారు. ఆ విషయాన్ని ఒవైసీనే స్వయంగా ప్రకటించారు. తమ సూచనను కాంగ్రెస్ పట్టించుకోకపోతే, చర్చలకు ముందుకు రాకపోతే అప్పుడు తమ దారి తాము చూసుకుంటామని తెలిపారు. బీజేపీకి ఎక్కడైనా రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే.. అక్కడ మైనార్టీల ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం పోటీ చేస్తుందని.. ఆ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఈ ఆరోపణలను ఒవైసీ తోసిపుచ్చారు. తాము హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీనే చేయలేదని.. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీజేపీని ఎదుర్కోలేదని, ఏమీ చేయలేదని కూడా వ్యాఖ్యానించారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో పేదలకు అన్యాయం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. బడాబాబులు పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడితే రేవంత్ సర్కార్ పేదలను వెంటాడుతోందని.. ఈ ప్రభుత్వ నిర్ణయాలతో పేదలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు.
Congress Party,AIMIM,Asaduddin Owaisi,Alliance with Congress,Maharastra Assembly Elections,Haryana,BJP b-team