2025-01-08 07:00:56.0
ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడర్లతో నిండిపోయిందన్నబండి సంజయ్
ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడర్లతో నిండిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదిగగా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదన్నారు. సాధికారత కల్పించడానికి బదులుగా వారి ఇళ్లను కూలగొట్టడం, వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం, గర్భిణీ స్త్రీలను వీధుల్లోకి నెట్టారని మండిపడ్డారు. ఇది పాలన కాదు.. ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో రేప్ కేసులు 28.84 శాతం, మహిళల హత్యలు 13 శాతం పెరిగాయని, కిడ్నాప్‌లు, అపహరణలు 26 శాతం పెరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉన్నదని ప్రశ్నించారు. కాంగ్రెస్ దోపిడిదారుల, విధ్వంసకారుల, అబద్ధాల పార్టీగా మారిందన్నారు.
Bandi Sanjay Kumar,Criticize,Congress,AICC,Filled with fake news peddlers,Cruelty against women