కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ లేదు : ఈటల

2025-02-08 15:21:45.0

ఢిల్లీని తాగుబోతు రాష్ట్రంగా మార్చిన ఘనత కేజ్రీవాల్‌దేని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

 కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, త్వరలోనే ఢిల్లీ ఫలితాలు తెలంగాణలో రిపీట్ కానున్నాయని ఈటల స్పష్టం చేశారు. ఢిల్లీ గల్లీలో దుర్గంధం చూస్తే అన్నం కూడా తినలేం. ఢిల్లీ ప్రజల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఈ తీర్పునిచ్చారు.

లోక్ సభ ఎన్నికల్లో మోదీకి 400 సీట్లు ఇవ్వనందుకు ప్రజలు బాధపడుతున్నారు. అందుకే ఆ తర్వాత జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం అందిస్తున్నారు ఢిల్లీలో కేజ్రీవాల్‌ బాగుపడ్డాడు తప్ప.. పేద ప్రజల బతుకులు మారలేదు. గల్లీ గల్లీలో లిక్కర్‌ షాపులు ఏర్పాటు చేశారు. ఢిల్లీని తాగుబోతు రాష్ట్రంగా మార్చిన ఘనత కేజ్రీవాల్‌ది. లిక్కర్ స్కాం తో ఢిల్లీ ప్రజలు తలదించుకున్నారు. ఢిల్లీ ప్రజల చేతిలో కేజ్రీవాల్‌,సిసోడియాలు చావుదెబ్బ తిన్నారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్‌ లేదు.అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసే సత్తా మోదీకే ఉందని ప్రజలు నమ్ముతున్నారని ఈటల పేర్కొన్నారు

BJP MP Etala Rajender,Delhi Asssembly Election Results,Liqueur Scam,AAP,Rahul Gandhi,Telangana,Delhi Assembly Elections,Arvind Kejriwal,Bibav Kumar,Swati Maliwal,BJP,PM MODI,Aam Aadmi Party,Manish Sisodia