కాంగ్రెస్ ప్రభుత్వం..కమీషన్‌ల ప్రభుత్వం : ఆర్‌ కృష్ణయ్య

2024-12-21 15:58:19.0

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదని, కమీషన్‌ల ప్రభుత్వమని ఆర్‌.కృష్ణయ్య అన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదని, కమీషన్‌ల ప్రభుత్వమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పిల్లుట్ల శ్రీనివాస్‌ నేతృత్వంలో కాచిగూడలోని అభినందన్‌ హోటల్‌లో బీసీ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు అన్యాయం చేస్తే రేవంత్‌ సర్కార్‌న్ని తరిమికొడతామని హెచ్చరించారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు 90 శాతంతో సబ్సిడీ రుణాలను ఇచ్చి, మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12 కుల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని, ప్రతి కార్పొరేషన్‌కు చైర్మన్‌, పాలకమండళ్ల సభ్యులను ఏర్పాటు చేయాలని సూచించారు. మారుతున్న సమాజంలో బీసీలు ఆర్థికంగా ఎదగడానికి బీసీ కార్పొరేషన్‌ ద్వారా నిరంతరం రుణాలు అందజేయాలని కోరారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలకు సొంత భవనాలకు నిర్మించాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Congress Government,R Krishnaiah,BC Corporation,Pillutla Srinivas,CM Revanth Reddy,Commissions government Rajya Sabha member