http://www.teluguglobal.com/wp-content/uploads/2016/05/combiflam.gif
2016-05-12 06:26:40.0
నొప్పిని తగ్గించే మందుగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న పెయిన్ కిల్లర్ కాంబిఫ్లామ్ లో నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. కొంత కాలవ్యవధిలో తయారయిన కొన్ని బ్యాచ్‌ల టాబ్‌లెట్లలో ప్రామాణికమైన నాణ్యత లేదని కేంద్ర ఔషధ ప్రామాణికత నియంత్రణ సంస్థ తన వెబ్‌సైట్లో వెల్లడించింది. శరీరంలో టాబ్‌లెట్లు ఎంత సేపటిలో విచ్చిన్నమవుతున్నాయి అనే విషయాన్ని తెలిపే పరీక్షలో ఇవి విఫలమయ్యాయని, ఈ పరీక్ష ద్వారా మందు ల్లో నాణ్యత శాతం ఎంత ఉందో కూడా తెలుస్తుందని ఆ సంస్థ పేర్కొంది. […]
నొప్పిని తగ్గించే మందుగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న పెయిన్ కిల్లర్ కాంబిఫ్లామ్ లో నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. కొంత కాలవ్యవధిలో తయారయిన కొన్ని బ్యాచ్‌ల టాబ్‌లెట్లలో ప్రామాణికమైన నాణ్యత లేదని కేంద్ర ఔషధ ప్రామాణికత నియంత్రణ సంస్థ తన వెబ్‌సైట్లో వెల్లడించింది. శరీరంలో టాబ్‌లెట్లు ఎంత సేపటిలో విచ్చిన్నమవుతున్నాయి అనే విషయాన్ని తెలిపే పరీక్షలో ఇవి విఫలమయ్యాయని, ఈ పరీక్ష ద్వారా మందు ల్లో నాణ్యత శాతం ఎంత ఉందో కూడా తెలుస్తుందని ఆ సంస్థ పేర్కొంది. జూన్ 2015, జులై 2015ల్లో తయారైన ఔషధ బ్యాచ్‌లను పరీక్షించారు వీటి ఎక్సపయిరీ తేదీలు మే, జూన్ 2018గా ఉన్నాయి. కాంబిఫ్లామ్‌ని ప్యారాసిట్ మోల్, ఇబుప్రొఫెన్ మందుల కాంబినేషన్‌తో తయారుచేస్తారు. భారత్‌లోని ఐదు అతిపెద్ద ఔషధ తయారీ కంపెనీల్లో ఒకటైన సనోఫి వీటిని ఉత్పత్తి చేస్తోంది. ఇది ఫ్రెంచ్ కంపెనీ.
కాంబిఫ్లామ్ శరీరంలో విచ్ఛిన్నమయ్యే సమయం ఆలస్యమైనా దీనివలన ఎలాంటి ప్రమాదం ఉండదని సనోఫి కంపెనీ ప్రతినిధి ఈ మెయిల్ ద్వారా ఒక న్యూస్ ఏజన్సీకి తెలిపారు. అయితే గురువారం ఉదయం భారత్‌లో సనోపి షేర్ల ధర రెండుశాతం వరకు తగ్గినట్టుగా తెలుస్తోంది.
https://www.teluguglobal.com//2016/05/12/కాంబిఫ్లామ్‌కి-కష్టాలు/