కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది దుర్మరణం

https://www.teluguglobal.com/h-upload/2024/12/27/1389581-pujab.webp

2024-12-27 12:44:36.0

పంజాబ్‌లోని భటిండాలో ఓ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు.

పంజాబ్‌లోని భటిండాలో ఓ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. స్థానిక ఎమ్మెల్యే జగ్పూర్ సింగ్ గిల్ తెలిపిన వివరాల ప్రకారం తల్వండీ సాబో నుంచి భటిండా నగరం వైపు వెళ్తున్న బస్సు అతివేగం కారణంగా అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా, ముగ్గురు తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన తెలిపారు.

గాయాలపాలైన మరో 18 మందికి షహీద్ భాయ్ మణిసింగ్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. వర్షం కురుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. జీవన్ సింగ్ వాలా గ్రామస్తులు చొరవచూపి కాల్వలో పడిన వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారి వివరాలను ఇంకా గుర్తించలేదని తెలుస్తోంది.

Punjab,Bhatinda,MLA Jagpur Singh Gill,Talwandi Sabo,Road accident,PM Modi,Punjab CM Bhagwant Mann,Crime news