2025-02-20 14:27:46.0
కాళేశ్వరం కమిషన్ గడువు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీల్లో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అవకతవకలపై న్యాయవిచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరోమారు కాంగ్రెస్ సర్కార్ పొడిగించింది. జస్టిస్ పీసీ ఘోష్ ఈనెల 23న హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో కమిషన్ గడువు ఏప్రిల్ 30 వరకు పెంచుతూ తెలంగాణ నీటి పారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సరి మిగిలిన విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయనున్నట్టు సమాచారం.
కాగా తదుపరి జరగనున్న విచారణలో సీనియర్ ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లతో సహ.. గత ప్రభుత్వంలోని కొంతమంది బడా నాయకులను కూడా పిలవనున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించగా.. అందులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయింది. రేవంత్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరపడానికి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది.
Kaleshwaram lift barrage,Justice PC Ghosh,Medigadda Barrage,BRS Party,CM Revanth reddy,KCR,KTR,Congress party,Former minister harish rao,Minister uttam kumar kumar reddy