2016-08-06 23:34:14.0
కొంత మంది వ్యక్తులు కుదురుగా కూర్చోలేరు. అటు ఇటు తిరుగుతారు. చేతులు ఊపుతారు. కుర్చీల్లో కూర్చోని కాళ్లు కదుపుతారు. అయితే అలాంటి వారిని క్రమశిక్షణ లేని వారని నిందిస్తారు. పని చేసేటప్పుడు చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శిస్తారు. ఇవన్నీ చేయదగిన పనులేనని పరిశోధనల్లో తేలింది. నిజానికివి చెడు అలవాట్లు కావని పైగా ఈ అలవాటు వల్ల ధమనులు ధృడంగా మారతాయని, నాడీ సంబంధ వ్యాధులు దరి చేరవని తేల్చారు. గంటల తరబడి కుర్చీల్లో కూర్చున్న వారు కాళ్లు […]
కొంత మంది వ్యక్తులు కుదురుగా కూర్చోలేరు. అటు ఇటు తిరుగుతారు. చేతులు ఊపుతారు. కుర్చీల్లో కూర్చోని కాళ్లు కదుపుతారు. అయితే అలాంటి వారిని క్రమశిక్షణ లేని వారని నిందిస్తారు. పని చేసేటప్పుడు చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శిస్తారు. ఇవన్నీ చేయదగిన పనులేనని పరిశోధనల్లో తేలింది. నిజానికివి చెడు అలవాట్లు కావని పైగా ఈ అలవాటు వల్ల ధమనులు ధృడంగా మారతాయని, నాడీ సంబంధ వ్యాధులు దరి చేరవని తేల్చారు. గంటల తరబడి కుర్చీల్లో కూర్చున్న వారు కాళ్లు కదిపితే మంచిదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాళ్లు కదిపితే ధమనుల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుందని, తద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని తేలింది. 11 మంది ఆరోగ్య వంతులైన యువకులపై చేసిన తాజా పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మూడు గంటలపాటు యువకులను కూర్చోబెట్టి ఒక కాలును మాత్రమే నిమిషానికి 250 పర్యాయాలు ఊపాలని, మరో కాలును కదలకుండా ఉంచాలని చెప్పారు. రెండు కాళ్లలోని ధమనులను పరిశీలించగా, కదిలించిన కాళ్లలోని ధమనుల్లో రక్త ప్రసరణ బాగా జరిగినట్టు పరిశోధకులు గుర్తించారు.అయితే ఎక్కువ సమయం కూర్చొని పని చేసేవారు ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యాయమాన్ని మానొద్దని వారు సూచించారు. ఈ తాజా పరిశోధనపై అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియోలాజీ ఇటీవల ఒక కథనం ప్రచురించింది.
https://www.teluguglobal.com//2016/08/07/కాళ్లు-చేతులు-ఊపితేనే-గు/