2025-01-20 10:39:42.0
తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా పునరుద్దరించింది.
తెలంగాణలో తగ్గిన కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా పునరుద్దరణ బ్రూవరీస్ సంస్థ స్పందించింది. రాష్ట్రంలో కింగ్ షిషర్ బీర్ల సరఫరాపై పునరుద్దరిస్తున్నట్లు తెలిపింది. పాత బకాయిల విడుదల బేవరేజ్ కార్పొరేషన్ స్పందించి త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు, కార్మికులు, వాటదారులు ప్రయోజనం దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని సంస్ధ పేర్కొంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం రోజు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో యునైటెడ్ బ్రేవరీస్ సంస్థ వెల్లడించింది. సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలు తమ నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేస్తూనే ఉంటాయి.!
Kingfisher beers,Telangana goverment,Breweries Company,United Breweries Company,CM Revanth reddy,stock market,Minister Jupally Krishna Rao,Stock Exchange