https://www.teluguglobal.com/h-upload/2022/12/10/500x300_430617-kidneys.webp
2022-12-10 07:37:02.0
శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కిడ్నీ ఒకటి. మలినాలకు క్లీన్ చేసే ముఖ్యమైన పనిని ఇది చేస్తుంది. అందుకే కిడ్నీలు పాడయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి.
శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కిడ్నీ ఒకటి. మలినాలకు క్లీన్ చేసే ముఖ్యమైన పనిని ఇది చేస్తుంది. అందుకే కిడ్నీలు పాడయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే రకరకాల లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. వీటిని క్లీన్ చేసేందుకు ఒక బెస్ట్ టెక్నిక్ ఉంది. అదేంటంటే..
కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు ఆటోమెటిక్‌గా క్లీన్ అవుతాయి. ఇంకా త్వరగా క్లీన్ అవ్వాలంటే కొత్తిమీర, కరివేపాకుతో ఒక ఔషధాన్ని తయారుచేసుకోవచ్చు.
ఆయుర్వేదం ప్రకారం కొత్తిమీర, కరివేపాకులు.. కిడ్నీల నుంచి వ్యర్ధాలను తొలగించడానికి సాయపడతాయి. దీనికోసం ముందుగా ఒక కొత్తిమీర కట్ట, ఒక కరివేపాకు కట్టను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి తరిగి పక్కన పెట్టుకోవాలి. తరిగిన ఆకులను ఒక గిన్నెలో వేసి అందులో నీళ్లు పోసి పదినిమిషాలపాటు బాగా మరిగించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దించి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక గ్లాసులో పోసుకుని తాగాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ఒకట్రెండు నెలల్లో కిడ్నీలు క్లీన్ అవుతాయి.
ఇక వీటితో పాటు కిడ్నీలను హెల్దీగా ఉంచుకోవడం కోసం వయస్సుకు తగిన బరువును మెయింటెయిన్ చేయడం ముఖ్యం. అలాగే వేగించిన పదార్థాలు తినడం తగ్గించాలి. పండ్లు, కూరగాయలను డైట్‌లో చేర్చుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్‌కు దూరంగా ఉండాలి.
Kidneys,foods,Kidney Cleanse,Kidney health Foods,Health Tips
Kidneys, Kidney Cleanse, Foods that support kidney health, Kidney health Foods, Health tips, health, Natural Kidney Cleanse at Home, కిడ్నీలు క్లీన్ , కిడ్నీలు
https://www.teluguglobal.com//health-life-style/natural-kidney-cleanse-at-home-detox-tea-diet-and-more-552514