కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు

2025-01-23 14:15:17.0

కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

సరూర్ నగర్‌ అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకోంది. ఈ కేసులో 8 మంది బ్రోకర్లను పోలీసులు గుర్తించారు. గత ఆరు నెలలుగా ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతోన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన వైద్యుడు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తమ దర్యాప్తులో వివరాలు సేకరించారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ. 55 లక్షలు తీసుకున్నారు డాక్టర్. అలకనంద ఆసుపత్రి చైర్మన్ సుమంత్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని దళారులు ఈ దారుణానికి బరి తెగించినట్లు వైద్య శాఖ అధికారుల విచారణలో బహిర్గతమైంది. దాదాపు 5 గంటలపాటు బాధితులతో సైతం వైద్య అధికారులు మాట్లాడారు. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించి డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం.. ప్రభుత్వానికి కీలక నివేదిక సమర్పించిందని తెలుస్తోంది. బెంగళూరు, చెన్నైకి చెందిన బ్రోకర్లే కిడ్నీల మార్పిడిలో సూత్రధారులు అని తెలుస్తోంది.

Sarur Nagar,Alaknanda Hospital,kidney racket case,hospital chairman Sumanth,Bangalore,Chennai,Department of Medicine,Telanaga goverment,CM Revanth reddy,Minister Damodar Rajanarasimha