http://www.teluguglobal.com/wp-content/uploads/2016/05/village-stove.gif
2016-05-28 06:13:02.0
కిరోసిన్, కట్టెలు, పిడకలు, పొలాల్లో ఎండిపోయిన గడ్డి లాంటివాటిని ఇంధనంగా ఉపయోగించి వంటచేసే మహిళలు కంటి వ్యాధి క్యాటరాక్ట్ బారినపడే ప్రమాదం ఉందని ఒక నూతన అధ్యయనం వెల్లడించింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్, అరవింద్ ఐ హాస్పటల్స్, లండన్ స్కూల్ ఆప్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్…సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధనలో గ్యాస్ లాంటి శుభ్రం చేసిన ఇంధనాలతో కాకుండా సాంప్రదాయ వంట చెరుకుని వాడే మహిళలు యాభై శాతం అధికంగా […]
కిరోసిన్, కట్టెలు, పిడకలు, పొలాల్లో ఎండిపోయిన గడ్డి లాంటివాటిని ఇంధనంగా ఉపయోగించి వంటచేసే మహిళలు కంటి వ్యాధి క్యాటరాక్ట్ బారినపడే ప్రమాదం ఉందని ఒక నూతన అధ్యయనం వెల్లడించింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్, అరవింద్ ఐ హాస్పటల్స్, లండన్ స్కూల్ ఆప్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్…సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధనలో గ్యాస్ లాంటి శుభ్రం చేసిన ఇంధనాలతో కాకుండా సాంప్రదాయ వంట చెరుకుని వాడే మహిళలు యాభై శాతం అధికంగా క్యాటరాక్ట్కి గురయ్యే అవకాశం ఉందని తేలింది.
భారత్లోని గ్రామాలు, చిన్నపట్టణాలనుండి 60 సంవత్సరాలు దాటినవారిని 6వేల మందిని ఎంపిక చేసుకుని ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారంతా తాము వంట చేయటం మొదలుపెట్టినప్పటినుండి ఎలాంటి వంట చెరుకుని వాడుతున్నారు, వారి జీవన శైలి, సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి… తదితర అంశాలు పరిశీలించారు. అలాగే పోషకాహార లోపం ఉందా, ఎండలో ఎంత సమయం ఉంటున్నారు, పొగతాగటం, పొగాకు నమలటం అలవాట్లున్నాయా… అనే విషయాలను సైతం పరిగణనలోకి తీసుకున్నారు.
వీరు నిర్వహించిన అధ్యయనంలో గ్యాస్ కాకుండా చెట్లు, జంతువుల ఆధారంగా లభించే వంటచెరుకుతో వంట చేసే అలవాటున్నవారు 46శాతం అధికంగా క్యాటరాక్ట్కి గురయ్యే అవకాశాలున్నాయని తేలింది, 20ఏళ్ల కంటే ఎక్కువగా సాంప్రదాయ వంటచెరకుని వాడినవారిలో 50 శాతం ఎక్కువగానూ, 30 సంవత్సరాలకంటే ఎక్కువగా వినియోగించినవారిలో 90శాతం అధికంగానూ క్యాటరాక్ట్ వచ్చే అవకాశాలున్నాయని గుర్తించారు. బయోమాస్ ఇంధనాల వాడకం, క్యాటరాక్ట్ లకు ఉన్న అనుబంధం ఈ అధ్యయనంలో స్పష్టంగా వెల్లడైందని లండన్ ఆరోగ్య సంస్థ ప్రొఫెసర్ ఆస్ట్రిడ్ ఫ్లెట్చర్ అన్నారు.
kerosene stove
https://www.teluguglobal.com//2016/05/28/kerosene-stove/