https://www.teluguglobal.com/h-upload/2022/09/20/500x300_401201-kerosene-movie.webp
2022-09-20 09:27:12.0
ఇటీవల ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సీరియల్ కిల్లర్ సినిమా విడుదలైంది. తెలంగాణా గ్రామీణ నేపథ్యం. ఇలాటిదే తెలంగాణా గిరిజన ప్రాంతపు నేపథ్యంలో ‘కిరోసిన్’ సీరియల్ కిల్లర్ సినిమా ఇంకొకటి. పేర్లు తీసేస్తే రెండూ ఒకలాగే వుంటాయి.
చిత్రం: కిరోసిన్
రచన – దర్శకత్వం : ధృవ
తారాగణం : ధృవ, ప్రీతీ సుందర్, భావనా మణికందన్, లావణ్య, బ్రహ్మాజీ, సమ్మెట గాంధీ తదితరులు
సంగీతం: అనంత నారాయణ, ఛాయాగ్రహణం : విజయ్ భాస్కర్ సద్దాల
నిర్మాతలు : దీప్తి కొండవీటి, పృధ్వీ
విడుదల : సెప్టెంబర్ 16, 2022 (ఆహా ఓటీటీ)
రేటింగ్ : 1.5/5
ఇటీవల ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సీరియల్ కిల్లర్ సినిమా విడుదలైంది. తెలంగాణా గ్రామీణ నేపథ్యం. ఇలాటిదే తెలంగాణా గిరిజన ప్రాంతపు నేపథ్యంలో ‘కిరోసిన్’ సీరియల్ కిల్లర్ సినిమా ఇంకొకటి. పేర్లు తీసేస్తే రెండూ ఒకలాగే వుంటాయి. అవే పాత్రలు, ప్రాంతాలు, హత్యలు, దర్యాప్తులు, కథా కథనాలు. సీరియల్ కిల్లర్ సినిమాలు భారతీ రాజా దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘ఎర్ర గులాబీ’ లు స్థాయిని అందుకునే పరిస్థితి కనిపించడం లేదు. వీటిలో ప్రధానంగా వుండాల్సింది సీరియల్ హంతకుడి మానసిక ప్రవృత్తి. అమెరికాలో 46 మదిని చంపిన బర్డ్ జేక్, 21 మందిని చంపిన బైలీబ్రదర్స్ వంటి సీరియల్ కిల్లర్స్ ని చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. వాళ్ళ సైకో ఎనాలిసిస్ చేసినప్పుడు భయంకర సత్యాలు తెలుస్తాయి. సీరియల్ కిల్లర్ సినిమాలు చూసినప్పుడు మన చుట్టూ మనకి తెలియకుండా సీరియల్ కిల్లర్ వుండొచ్చన్న హెచ్చరికని చేసేలా వుంటాయి. ఇలా ఒక ప్రయోజనం లేకుండా సీరియల్ కిల్లర్ సినిమాల్ని తీసి లాభం లేదు.
అదొక తెలంగాణా గిరిజన గూడెం. అక్కడ అడవిలో గౌరీ (లావణ్య) అనే యువతి హత్య జరుగుతుంది. ఎవరో చంపి శవాన్ని దహనం చేశారు. పోలీసులు రంగంలోకి దిగుతారు. అక్కడి సర్పంచ్ నాయక్ (మధుసూదన రావు), ఎమ్మెల్యే వీరబాబు (బ్రహ్మాజీ) ఒత్తిడికి లొంగి ఒక అమాయకుడ్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు పోలీసులు. పోలీసు ఉన్నతాధికారి ఈ గూడెం చుట్టు పక్కల ఇది మూడో హత్య అనీ చెప్పి, వెంటనే ఈ హత్యల మిస్టరీ తేల్చేందుకు ఏసీపీ వైభవ్ (ధృవ) ని అక్కడికి పంపిస్తాడు. ఏసీపీ వైభవ్ ఇంటరాగేషన్ స్పెషలిస్టు. అతను గౌరీ హత్య కేసు చేపట్టి దర్యాప్తు ప్రారంభిస్తాడు. అరెస్ట్ చేసిన అమాయకుడ్ని విడుదల చేసి ఎస్సైని సస్పెండ్ చేస్తాడు. అనుమానితుల్ని ప్రశ్నిస్తాడు. కొందర్ని పట్టుకుని కొడతాడు. ఇంతలో ఆ ప్రాంతాని కొచ్చిన సిటీ అమ్మాయి హత్య జరుగుతుంది. ఈమె శవాన్ని కూడా కిరోసిన్ పోసి కాల్చేశాడు హంతకుడు.
ఎవరీ సీరియల్ కిల్లర్? ఏసీపీ వైభవ్ ఎలా పట్టుకూన్నాడు? పట్టుకునే లోగా ఇంకిన్ని హత్యలు జరిగాయా? ఇదీ మిగతా కథ.
ఇందులో ఏసీపీ పాత్ర దర్శకుడే పోషించాడు. మిగిలిన పాత్రల్లో అందరూ కొత్త వాళ్ళే. అటవీ ప్రాంతపు లొకేషన్స్ ఎక్కువున్నాయి. గిరిజన గూడెంలో బయటి నుంచి చిన్నపాటి శిథిలమైన పోలీస్ స్టేషన్. లోపలికి వెళ్తే బయటి రూపంతో సంబంధం లేకుండా విశాలమైన అధునాతన హైటెక్ పోలీస్ స్టేషన్. బయటి లొకేషన్ వేరే, లోపలి లొకేషన్ వేరే. వీటిని కలిపి చీట్ చేసినప్పుడు సహజత్వాన్ని పట్టించుకోలేదు. అలాగే పోలీసు వాహనాలు. ఒక వాహనం వైజాగ్ నెంబర్ ప్లేట్ తో వుంటుంది. ఇంకో సీన్లో తెలంగాణా స్టేట్ పోలీస్ అని తగిలించుకుని వస్తుంది. మరింకో సీన్లో హైదరాబాద్ పోలీస్…
ఇంటరాగేషన్ స్పెషలిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఆసక్తి రేపే ఏసీపీ పాత్ర ఇంటరాగేషనే చేయడు. కనీసం ఈ ఇంటరాగేషన్ పాయింటునైనా ప్రధానంగా చేసి, పోలీస్ ఇంటరాగేషన్లో తెలియని కోణాలు వెల్లడి చేసి వుంటే కథా పరంగా ఈ సినిమా ఎంతో నిలబడేది. దీని బదులు డైలాగులతోనే కథనం నడుస్తూ వుంటుంది. ఈ డైలాగుల ద్వారా నైనా కథలో మలుపులు, టెన్షన్, సస్పెన్స్, థ్రిల్ వంటివి పుట్టవు. యాక్షన్ సీన్స్ తో పరిగెట్టాల్సిన కథని డైలాగులతోనైనా వేడి పుట్టించకుండా రెంటికీ చెడ్డ రేవడి చేశారు.
ఈ హత్యలు గూడెంలో భయ వాతావరణం కూడా సృష్టించవు. ఆడవాళ్ళ హత్యలు జరుగుతూంటే డోంట్ కేర్ అన్నట్టు ఆడవాళ్ళు వుంటారు. మరిన్ని హత్యలు జరగకుండా ఏసీపీ చర్యలు కూడా తీసుకోడు. ఈ బలహీన పాత్రలు, నటనలు, కథా కథనాలు, దర్శకత్వం కిరోసిన్ కోరుకుంటున్నట్టు వుంటాయి. ఆ కిరోసిన్ డబ్బా ప్రేక్షకుల చేతిలో.
చివరికి హంతకుడ్ని పట్టుకుని చంపేస్తాడు ఏసీపీ. చంపేసి వాడి మీద కేసు ఎలా ప్రూవ్ చేస్తాడో తెలీదు. ఇది పోలీస్ ప్రొసీజురల్ జానర్ కి చెందిన కథ. ప్రొఫెషనల్ స్కిల్స్ తో టెర్రిఫిక్ గా తీయాల్సిన రూరల్ థ్రిల్లర్ సినిమా!
Kerosene Movie,Dhruva,Brahmaji,Aha
kerosene movie review telugu, Kerosene Movie, kerosene movie review, kerosene movie ott, kerosene movie rating, kerosene movie cast, kerosene movie 2022 review, kerosene movie review in telugu, kerosene movie heroine name, kerosene movie release date, Dhruva, Brahmaji, Preetei Sundar, Teja Kunuru, telugu global reviews, కిరోసిన్, కిరోసిన్ మూవీ రివ్యూ, మూవీ రివ్యూ
https://www.teluguglobal.com//cinema-and-entertainment/movie-reviews/kerosene-movie-review-and-rating-in-telugu-344564