2022-06-27 00:44:41.0
వైసీపీలో అలకలు, అసంతృప్తులు క్రమక్రమంగా బయటపడుతున్నాయి. ఇటీవల రాజ్యసభ సీటు ఆశించి అది రాకపోవడంతో కాస్త అసంతృప్తికి లోనయ్యారు కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం నేత కిల్లి కృపారాణి. తాజాగా సీఎం పర్యటన సందర్భంగా ఆమె మరోసారి అలిగారు. ప్రొటోకాల్ లో తన పేరు ఉన్నా కూడా తనకు వాహనం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగానని, తనని కలెక్టర్ గుర్తించకపోవడం ఏంటని మండిపడ్డారు. స్థానిక నాయకులపై కూడా ఆమె ఆగ్రహం […]
వైసీపీలో అలకలు, అసంతృప్తులు క్రమక్రమంగా బయటపడుతున్నాయి. ఇటీవల రాజ్యసభ సీటు ఆశించి అది రాకపోవడంతో కాస్త అసంతృప్తికి లోనయ్యారు కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం నేత కిల్లి కృపారాణి. తాజాగా సీఎం పర్యటన సందర్భంగా ఆమె మరోసారి అలిగారు. ప్రొటోకాల్ లో తన పేరు ఉన్నా కూడా తనకు వాహనం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగానని, తనని కలెక్టర్ గుర్తించకపోవడం ఏంటని మండిపడ్డారు. స్థానిక నాయకులపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మర్యాద ఇక చాలంటూ వ్యంగ్యోక్తులు విసిరి అక్కడినుంచి వెళ్లిపోయారు.
ధర్మాన బతిమిలాడినా..
శ్రీకాకుళం జిల్లాలో అమ్మఒడి నగదు జమ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటున్న క్రమంలో ఈ వ్యవహారం బయటపడింది. జిల్లాకు చెందిన నేతలందరికీ ప్రొటోకాల్ వాహనాలు అరేంజ్ చేశారు అధికారులు. కానీ కిల్లి కృపారాణి పేరు మాత్రం అందులో మిస్ అయింది. దీంతో ఆమె అలిగారు. అవమానం జరిగిందని తాను ఇక అక్కడ ఉండలేనని వెళ్లిపోయారు.
ఆమె కారు ఎక్కిన తర్వాత మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఆమె దగ్గరకు వెళ్లి బతిమిలాడారు. తాను కూడా ఆమెతో పాటే బయట ఉంటానన్నారు. కానీ కృపారాణి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే విషయం అంతా బయటకు పొక్కిందని, అవమాన భారాన్ని తాను మోయలేని, తనకు ఏడుపొస్తోందని, ఎమోషనల్ అవుతున్నానని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు.
పార్టీ కోసం కష్టపడుతుంటే తనకు కనీసం విలువ ఇవ్వడంలేదని ఆరోపించారు కిల్లి కృపారాణి. ప్రొటోకాల్ లో పేరున్నా తనను వేదిక దగ్గరకు రాకుండా చేయాలని కుట్ర పన్నారని, అన్నీ తెలిసే ఈ పని చేశారని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు.
సీఎం పర్యటన అయినా సరే ఆమె బెట్టు వీడకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు. సీఎం పర్యటనను సైతం ఆమె బాయ్ కాట్ చేశారు. ఇటీవల రాజ్యసభ సీట్ల వ్యవహారంలో కృపారాణి తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత తొలిసారిగా సీఎం జగన్ శ్రీకాకుళం రావడం.. ఆ కార్యక్రమంలోనే ప్రొటోకాల్ పేరుతో ఆమెను పక్కనపెట్టడంతో.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటికెళ్లిపోయారు.
Andhra Pradesh,boycott,cm ys jagan,Killi Kriparani,Protocol clash,Srikakulam Program,ycp leader