కుంభమేళాలో భక్తులకు ప్రసాదం వడ్డించిన సుధామూర్తి

2025-01-22 10:37:18.0

ఇస్కాన్‌ కిచెన్‌ ను పరిశీలించిన ఎంపీ

https://www.teluguglobal.com/h-upload/2025/01/22/1396695-sudha-murthy-kumbh-mela.webp

ప్రయాగ్‌ రాజ్‌లో నిర్వహిస్తోన్న మహా కుంభమేళాను రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇస్కాన్‌ క్యాంప్‌ ను సందర్శించి మహా ప్రసాదం తయారీని పరిశీలించారు. అక్కడే ఉన్న వాలంటీర్లతో మాట్లాడి భోజనం తయారీ గురించి ఆరా తీశారు. ఆ తర్వాత కుంభమేళాకు వచ్చిన భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. తన పూర్వీకులకు తర్పణాలు వదిలేందుకు కుంభమేళాకు వచ్చానని.. ఇది తీర్థరాజ్‌ అని పేర్కొన్నారు. మహా కుంభమేళాలో ఇస్కాన్‌ ప్రతి రోజు లక్షలాది మందికి భోజనాలు వండి వడ్డిస్తోంది. అదానీ గ్రూప్‌ సహాయంతో ఆహార వితరణ చేస్తోంది.

Sudha Murthy,Infosys,ISKON,Lunch,Dinner to Devotees,Maha Kumbh Mela,Prayag Raj