2025-02-24 11:23:38.0
సామాన్య భక్తులతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన బాలీవుడ్ స్టార్
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకంభమేళా ను బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ సందర్శించారు. ఇవాళ ఉదయం సామాన్య భక్తులతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అక్షయ్.. ఈసారి జరిగిన కుంభమేళా ఏర్పాట్లను ప్రశంసించారు. గతంలో ఇలా ఉండేది కాదని చెప్పారు. ఇప్పటికే అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు కుంభమేళాకు హాజరయ్యారు. బుధవారంతో కుంభమేళా ముగియనున్నది.
కుంభమేళాలో బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ తన కుటుంబసభ్యులతో కలిపి పుణ్యస్నానం ఆచరించారు ఈ సందర్భంగా భక్తులు ఆమెను చూడటానికి, సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు.
Akshay Kumar thanks,UP CM,On Mahakumbh arrangements,After taking holy dip,‘Bohut maza aaya,badiya intezaam hai’