https://www.teluguglobal.com/h-upload/2025/01/28/1398198-stage-collapse.webp
2025-01-28 05:20:58.0
యూపీలోని బాగ్పత్లో ఆదినాథుడి నిర్వాణ లడ్డూ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా చోటుచేసుకున్న ఘటన
ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. లడ్డూ మహోత్సవం నిర్వహిస్తున్న ఓ వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో 60మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం యూపీలోని బాగ్పత్లో ఆదినాథుడి నిర్వాణ లడ్డూ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చెక్కతో ఏర్పాటు చేసిన వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో5 గురు మృతి చెందగా.. అనేకమందికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేగాకుండా 50 మందికి పైగా భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని బైటికి తీయడానికి అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
UP,5 dead,Over 60 injured,Stage collapses,At Nirvana Laddu Parv,In Baghpat