2016-04-11 07:19:20.0
ఫ్యాషన్లన్నీ కొత్త ఆలోచనలు, సృజనాత్మకత నుండే పుడతాయి. వెంట్రుకలకు భిన్న రంగులు వేసుకోవడం పాత ఫ్యాషనే. కానీ ఆ రంగులు ఇంద్రధనస్సులా ఉంటే…ఇది మాత్రం కొత్త ఆలోచనే. ఇంధ్ర ధనస్సులోని అందమైన రంగులను జుట్టుకి అంచెలంచెలుగా వేసుకోవడమే కాదు, తల వెనుక భాగంలో ఏదైనా బొమ్మ కనిపించేలా జుట్టుని కత్తిరించుకోవడం రష్యాలో కనబడుతున్న కొత్త ఫ్యాషన్ ట్రెండ్. కటిచ్కా అనే రష్యన్ యువతి సగం పింక్, సగం బ్లూ రంగులతో అలంకరించిన తన కురులను పక్కకు జరిపి, […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/04/hair-style.gif
ఫ్యాషన్లన్నీ కొత్త ఆలోచనలు, సృజనాత్మకత నుండే పుడతాయి. వెంట్రుకలకు భిన్న రంగులు వేసుకోవడం పాత ఫ్యాషనే. కానీ ఆ రంగులు ఇంద్రధనస్సులా ఉంటే…ఇది మాత్రం కొత్త ఆలోచనే. ఇంధ్ర ధనస్సులోని అందమైన రంగులను జుట్టుకి అంచెలంచెలుగా వేసుకోవడమే కాదు, తల వెనుక భాగంలో ఏదైనా బొమ్మ కనిపించేలా జుట్టుని కత్తిరించుకోవడం రష్యాలో కనబడుతున్న కొత్త ఫ్యాషన్ ట్రెండ్. కటిచ్కా అనే రష్యన్ యువతి సగం పింక్, సగం బ్లూ రంగులతో అలంకరించిన తన కురులను పక్కకు జరిపి, తల వెనుక భాగంలో ఉన్న పిల్లిబొమ్మని చూపుతూ దిగిన ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
నచ్చిన రంగులను ఎంపిక చేసుకుని వాటిని జుట్టుకి వేసుకుని తల వెనుక భాగంలో అదే రంగులతో టూటూలా కనిపించేలా జుట్టుని కట్ చేయడాన్నే రెయిన్‌బో అండర్ కట్ టాటూగా పిలుస్తున్నారు. కటిచ్కా ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సరికొత్త ట్రెండ్ కోసం మీకు నచ్చిన రంగులను ఎంపిక చేసుకోండి అని దీని సృష్టికర్త ఆలియా అస్కారోవా అంటోంది.
Hair tattoos,russia,Women Hair Tattos