కులగణన, ఎస్సీ వర్గీకరణపై నేడు పీసీసీ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌

2025-02-14 05:57:31.0

పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించనున్నామన్న పీసీసీ చీఫ్‌

పీసీసీ ఆధ్వర్యంలో ఇవాళ మధ్యాహ్నం గాంధీభవన్‌లో కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొంటారని వివరించారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించనున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమగ్ర సమాచారం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 

PCC,Power Point presentation,On caste,SC classification,Maheshkumar Goud,CM Revanth Reddy,Deputy CM Batti vikramarka