కులగణన సర్వే వందకు వంద శాతం తప్పు

2025-02-03 08:53:32.0

నెలరోజుల్లో ప్రభుత్వం రీ సర్వే చేయాలని మాజీ మంత్రి డిమాండ్‌

బీసీ జనాభా లెక్కలపై ప్రభుత్వ పునః సర్వే చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ లెక్కలు తప్పులతడకగా ఉన్నాయన్నారు. సమానత్వం లేకపోతే మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సర్వే వందకు వంద శాతం తప్పన్నారు. మళ్లీ నెలరోజుల్లోగా రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఒక గ్రామంలో పూర్తయితే అక్కడ ఇంత జనాభా ఉన్నది. ఇంత మంది సర్వే పూర్తయిందని ఒక లిస్ట్‌ పెట్టే బాధ్యతను పంచాయతీ సెక్రటరీకి ఇవ్వాలన్నారు. మీకు చాతకాదంటే చెప్పండి డిగ్రీ, జూనియర్‌, గురుకుల కాలేజీల్లో చదవే విద్యార్థులకు మేము విజ్ఞప్తి చేస్తామన్నారు. ట్యాబులు ఇవ్వండి. వాళ్ల తోని సర్వే చేయించి మీకు నివేదిక ఇస్తామన్నారు. అంతేగాని మీ చర్యల వల్ల దేశంలో మరో బీసీ ఉద్యమం వస్తుంది.. అది తెలంగాణ నుంచే మొదలవుతుందని హెచ్చరించారు. ఈ సర్వే ద్వారా అనవసరమైన కొట్లాటపెట్టించిన వారు మీరు అవుతారన్నారు. కాబట్టి ఎవరి వాట ఎంతనో వారికి ఇవ్వాలన్నారు. 

Telangana,Srinivas Goud,Congress,Conspiracy,On population of BC,Cabinet Sub Committee,Caste Census,Final Report On BC Reservation