కుల సరిగా లేదు.. మళ్లీ సర్వే చేయాల్సిందే

2025-02-04 10:36:34.0

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

ప్రభుత్వం చేయించిన సమగ్ర కుల గణన సర్వే సరిగా లేదని.. సమగ్రత లోపించిన ఈ సర్వేపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో కుల గణన సర్వేపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ నగరంలో 30 శాతం మంది కూడా సర్వేలో పాల్గొనలేదని, 57 ప్రశ్నలు అడిగితే ప్రజలు భయపడ్డారని చెప్పారు. చాలా మంది సర్వే సందర్భంగా వివరాలు వెల్లడించలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందశాతం సర్వే చేసినప్పుడే దానికి విలువ ఉంటుందన్నారు. 96 శాతం సర్వే అంటే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. సింపుల్‌గా చేయాల్సిన సర్వేను ఎక్కువ ప్రశ్నలతో కాంప్లికేట్‌ చేశారన్నారు. కుల గణన మళ్లీ చేపట్టాలని డిమాండ్‌ చేశరాఉ. 2011 జనాభా లెక్కలకు, కుల గణనలోని లెక్కలకు, ఎలక్షన్‌ కమిషన్‌ దగ్గర ఉన్న ఓటర్ల లెక్కకు మధ్య చాలా తేడా ఉందన్నారు. ఈ అంశాలన్ని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీసీ జనాభా తగ్గినట్టుగా ప్రచారం చేస్తున్నారని.. దీనిపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కులగణన సర్వేకు చట్టబద్ధత ఇచ్చి దానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో 45 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. పార్టీల ఇష్టానుసారం కాకుండా చట్టబద్దతతో రిజర్వేషన్లు అమలు చేసేలా చూడాలన్నారు.

Caste Census,Congress Govt,Not Comprehensive,BRS,Talasani Srinivas Yadav,Assembly