2025-01-24 05:35:46.0
కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హౌసింగ్ స్థలాల వేలంలో భాగంగా ముందస్తుగా ఆయన్ను గృహనిర్బంధం చేసినట్లు తెలుస్తోంది.ఆయన ఇంటి ముందు ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కీలక నేతలను సైతం ముందస్తుగా నిర్బంధించినట్లు సమాచారం. హౌసింగ్ స్థలాల వేలంగా ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే బీఆర్ఎస్ నియోజక ఎమ్మెల్యే, ఆ పార్టీకి చెందిన కీలక నేతలను పోలీసులను ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష గులాబీ పార్టీ నేతలు పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కృష్ణారావు, మంత్రి పొంగులేటిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రభుత్వ భూములను అమ్ముకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. వేలంలో పాల్గొనకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలానికి వెళ్లేందుకు అనుమతి ఉన్నప్పటికీ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. స్థలాలు కొనేందుకు ఇప్పటికే డీడీలు కూడా తీసున్నామని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడకుండా అడ్డుకుంటున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ భూములు అమ్మేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడంపై కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే స్థలాలను ప్రభుత్వం తరఫున వేలం వేయడమేంటని ప్రశ్నించారు.
BRS MLA Madhavaram Krishna Rao,House arrested,Auction of housing plots,BRS Party,KTR,KCR,Minister Ponguleti,CM Revanth reddy,Congress party