2025-02-26 09:52:49.0
సూడాన్‌లో ఘోర ప్రమాదం విమాన ప్రమాదం జరిగింది.
సూడాన్‌లో ఘోర ప్రమాదం విమాన ప్రమాదం జరిగింది. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి ఒక సైనిక విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 46 మంది సైనిక సిబ్బంది, పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఘటనాస్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Sudan,Military plane,crashed,Air base,Assistive measures,Military sources