కూల్చడం మార్చడం ఆనవాళ్లు చెరిపేయడమే మీ పాలన : కేటీఆర్

2024-12-19 10:14:30.0

తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

తెలంగాణ అసెంబ్లీలో మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సచివాలయం, అసెంబ్లీ పక్క పక్కనే ఉంటే బాగుంటుందంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు కూల్చినా ఇంకా మీ ఆకలి తీరలేదా? మహోన్నతుల సమాధులను కూడా వదిలిపెట్టరా? అంటూ ప్రశ్నించారు. కూల్చడం! మార్చడం! ఆనవాళ్లు చెరిపేయడం! ఇదేగా మీకు చేతనైనదంటూ విమర్శించారు. ఇది నిర్మాణాత్మక ప్రభుత్వం కానే కాదని..విధ్వంసకారుడి వికృత ఆలోచ‌న‌ల‌కు ప్రతిరూపమని దుయ్యబట్టారు.

మహోన్నతులను గౌరవించడం చేతకాదు అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన ఎన్టీఆర్ మీదనా మీ పిల్లికూతలు..? పేదల ఇళ్లు కూల్చినా ఇంకా మీ ఆకలి తీరలేదా..? మహోన్నతుల సమాధులను కూడా వదిలిపెట్టరా..? అని నిల‌దీశారు.కూల్చడం! మార్చడం! ఆనవాళ్లు చెరిపేయడం! ఇదేగా మీకు చేతనైనది!! ఇది నిర్మాణాత్మక ప్రభుత్వం కానే కాదు.. విధ్వంసకారుడి వికృత ఆలోచ‌న‌ల‌కు ప్రతిరూపం! అని కేటీఆర్ మండిప‌డ్డారు.

KTR,BRS Party,Manugodu MLA Komatireddy Rajagopal Reddy,Secretariat,Assembly,CM Revanth reedy,Telangana goverment,Congress party