https://www.teluguglobal.com/h-upload/2024/11/07/1375691-west-indes.webp
2024-11-07 12:16:29.0
కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డేలో విండీస్ పేస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఆ జట్టు కెప్టెన్ షాయ్ హోప్‌పై కోపంతో మ్యాచ్ మధ్యలో మైదానం విడిచి వెళ్లిపోయాడు.
ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసక్తికర ఘటన జరిగింది. ఆటగాళ్లా ఫీల్డింగ్ విషయంలో కెప్టన్ షాయ్ హోప్, బౌలర్ అల్జారీ జోసెఫ్ మధ్య గోడవ జరిగింది. కెప్టెన్ మీద మైదానం వదిలి వెళ్లిపోయాడు. ఫీల్డింగ్‌ను సెట్ చేయడంలో సారథి హోప్ నిర్ణయాలను జోసెఫ్ తప్పుపట్టాడు. అలా మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ విడిచిన అతడు ఓ ఓవర్ పాటు నిరసన వ్యక్తం చేశాడు. ఆ సమయంలో పది మంది ఆటగాళ్లు మాత్రమే విండీస్‌కు ఫీల్డింగ్ చేశారు. ఒక ఓవర్ తర్వాత జోసెఫ్ మళ్లీ మైదానంలోకి దిగి జట్టుతో చేరాడు. ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు విజయం సాధించింది. ఇంగ్లండ్‌ను విండీస్ 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కీసీ కార్టీ, బ్రాండన్ కింగ్‌లు సెంచరీలు బాదడంతో పాటు రెండో వికెట్‌కు 209 పరుగుల రికార్డుస్థాయి భాగస్వామ్యం అందించారు. దీంతో విండీస్ మరో ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ విధించిన 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.
An eventful start to the game for Alzarri Joseph! #WIvENGonFanCode pic.twitter.com/2OXbk0VxWt
— FanCode (@FanCode) November 6, 2024