https://www.teluguglobal.com/h-upload/2022/11/12/500x300_425643-faster-career.webp
2022-11-13 10:53:07.0
మంచి ఉద్యోగం సాధించాలంటే సబ్జెక్ట్ నాలెడ్జితో పాటు రకరకాల స్కిల్స్ అవసరమవుతాయి. ఇటీవల విడుదలైన కొన్ని సర్వేల్లో కార్పొరేట్ సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు చాలామంది విద్యార్థుల్లో ఉండటం లేదని తేలింది.
మంచి ఉద్యోగం సాధించాలంటే సబ్జెక్ట్ నాలెడ్జితో పాటు రకరకాల స్కిల్స్ అవసరమవుతాయి. ఇటీవల విడుదలైన కొన్ని సర్వేల్లో కార్పొరేట్ సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు చాలామంది విద్యార్థుల్లో ఉండటం లేదని తేలింది. అసలు మంచి ఉద్యోగానికి కావల్సిన నైపుణ్యాలేంటి? వాటిని ఎలా నేర్చుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఏదైనా ఉద్యోగానికి ముందుగా కావల్సింది వెర్బల్ కమ్యూనికేషన్. దీన్నే భావ వ్యక్తీకరణ అని కూడా అంటారు. మీలో ఎన్ని స్కిల్స్ ఉన్నప్పటికీ వాటిని బయటకు వ్యక్తపరచలేకపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే ఉద్యోగంలో రాణించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. కార్పొరేట్ రంగాల్లో బాగా కమ్యూనికేట్ చేయగలిగే వారికే ఎక్కువ ప్రాధాన్యం ఉంది.
లీడర్‌షిప్: మీరు ముందుండి తోటి ఉద్యోగుల్ని మీతో నడిపించే సత్తా మీకుంటే మీ కెరీర్‌కు తిరుగులేనట్టే. ప్రస్తుత యుగంలో లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్లకు అవకాశాలకు కొదువ లేదు. ప్రపంచమంతా లీడర్‌షిప్ క్రైసిస్‌లో ఉంది. మనవాళ్లు ప్రతీచోటా లీడర్లుగా ఎదుగుతున్నారు. ఉద్యొగంలో ఎదగాలన్నా ఇదే సూత్రం వర్తిస్తుంది.
గ్రూప్ డిస్కషన్: ఏదైనా విషయాన్ని గ్రూప్‌తో చర్చించడం ద్వారా అందులో ఉన్న అన్ని కోణాలు తెలుస్తాయి. ఉద్యోగంలో, కీలకమైన డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇలాంటి డిస్కషన్స్ ఉపయోగపడతాయి. గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ పెంచుకోవడంం కోసం దినపత్రికలు, జర్నల్స్, పుస్తకాలు తరచుగా చదువుతూ ఉండాలి. కరెంట్ అఫైర్స్‌పై అవగాహన పెంచుకోవాలి.
టెక్నికల్ స్కిల్స్: వీటితో పాటు ముఖ్యమైన మరో స్కిల్ టెక్నికల్ నాలెడ్జ్. ఎలక్ట్రానిక్/ డిజిటల్ పరికరాలను ఎలా ఉపయోగించాలి? ఇంటర్నెట్‌ను తెలివిగా ఎలా ఉపయోగించుకోవాలి? లాంటి విషయాలు నేర్చుకోవడం ద్వారా ఉద్యోగంలో మెరుగ్గా రాణించొచ్చు. ఈ డిజిటల్ వరల్డ్‌లో స్మార్ట్‌గా ఉన్నవారికే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభించే వీలుంది.
రీసెర్చ్: చదువుకునే స్టూడెంట్స్‌కు కొత్త విషయాలపై రీసెర్చ్ చేయడంపై ఆసక్తి ఉండాలి. ప్రతి అంశాన్ని విభిన్న కోణాల్లో పరిశీలించడం అలవాటు చేసుకోవాలి. ఇది కెరీర్‌లో ఎదగాడనికి పనికొస్తుంది. రీసెర్చ్ స్కిల్స్ ఉన్నవారికి కార్పొరేట్ రంగంలో మంచి డిమాండ్ ఉంటుంది.
ఇకపోతే ప్రతి విషయాన్నీ పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఆలోచించడం, పనులు వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయడం లాంటి స్కిల్స్ కూడా కెరీర్‌లో వేగంగా ఎదిగేందుకు ఉపయోగపడతాయి.
Career,Career Growth,Technical skills
fastest growing careers in india, career, Growth in career, Grow your career, Grow your career quotes, Grow my career or grow in my career, career grow, Career Growth and Career Development, career growth meaning in telugu, కెరీర్‌లో వేగంగా ఎదిగేందుకు ఇవి కావాలి, కెరీర్, లీడర్‌షిప్, గ్రూప్ డిస్కషన్, టెక్నికల్ స్కిల్స్, రీసెర్చ్
https://www.teluguglobal.com//business/these-are-needed-to-growth-faster-in-career-356896