2025-02-27 13:36:01.0
ఐపీఎల్-2025 ముంగిట దిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన చేసింది
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌కు ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగించింది. డీసీగా మెంటర్‌గా నియమించింది. ఈ మేరకు డీసీ సామాజిక మాధ్యమాల్లో కీలక ప్రకటన చేసింది. పీటర్సన్ 2012 నుంచి 2014 వరకు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. 2014 సీజన్‌లో డీసీకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ అదే జట్టుకు మెంటార్ రూపంలో సేవలు అందించనున్నాడు. పీటర్సన్ ఢిల్లీ హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ, క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు, అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మాట్, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్‌లతో కలిసి పనిచేయనున్నాడు.ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ 2009, 2010, 2012, 2014, 2016 సీజన్లలో ఐపీఎల్‌లో ఆడాడు.
2012- 2014 మధ్య దిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. ఛాంపియన్‌గా జట్టును ఛాంపియన్‌గా నిలపడమే లక్ష్యంగా దిల్లీ క్యాపిటల్స్ తమ కోచింగ్ స్టాఫ్‌ను మార్చేసింది. రికీ పాంటింగ్ స్థానంలో భారత మాజీ ఆటగాడు హేమంగ్ బదానీని హెడ్ కోచ్‌గా నియమించింది. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనూ కోచ్‌లను మార్చింది. అయితే, ఐపీఎల్ 2025 కోసం దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఎవరుంటారనే ఇంకా ఫ్రాంఛైజీ ప్రకటించలేదు. ఫ్రాంచైజీ ఢీసీకి నూతనంగా జట్టులోకి తీసుకున్న కేఎల్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Delhi Capitals,Kevin Pietersen,IPL-2025,DC Mentor,Head coach Hemang Badani,Director of Cricket Venugopal Rao,Assistant coach Matthew Matt,bowling coach Munaf Patel,Ricky Ponting,IPL 2025,SRH,CSK,RR,RCB,GMR,Gandhi mallikarjuna rao