2024-12-21 13:29:14.0
తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో 500 కోట్ల రూపాయలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం చేశామని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 430 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను డిసెంబర్ 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించినట్లు ఈటల తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల తాకిడి ఎక్కువ అవ్వటం వలన రాకపోకలకు ఇబ్బంది అవుతుంది.
కాబట్టి ప్రధాని మోదీ చర్లపల్లి లో గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం కావాలని, ఈ ప్రాంతాన్ని ఎంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని చేశారు అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వారం రోజుల పాటు మా నాయకత్వం అంతా కూడా రైల్వే అధికారులతో, రాష్ట్ర ప్రభుత్వంతో సమీక్షించి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నమన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నట్లు ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
Charlapally railway station,central government,Malkajigiri MP Etala Rajender,Minister Ashwini Vaishnav,Union Minister Kishan Reddy,Secunderabad,Kachiguda,Nampally Railway Station,PM MODI