కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు!

2024-10-16 08:24:01.0

దీపావళి కానుక ప్రకటించిన కేంద్ర సర్కారు

https://www.teluguglobal.com/h-upload/2024/10/16/1369499-da-hike.webp

దీపావళి పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌. ఉద్యోగుల డీఏ 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్దిసేపట్లోనే వెలువడే అవకాశముంది. డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ప్రస్తుతం 42 శాతం ఉండగా, తాజా పెంపుతో 45 శాతానికి పెరుగనుంది. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి ఈ పెంపు వర్తించనుంది.

Central Government,Employees,DA 3% Increase,Deepavali Gift,Union Cabinet