కేంద్ర మంత్రి అమిత్‌ షాతో పవన్‌ కల్యాణ్‌ సమావేశం

2024-11-06 14:02:51.0

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు.

https://www.teluguglobal.com/h-upload/2024/11/06/1375417-pavan.webp

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు అమిత్‌షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఏపీ రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ ఏర్పడిన తరువాత ఇప్పటివరకు తాను ఢిల్లీ పెద్దలను కలవలేదని పవన్ కళ్యాణ్ మీడియాతో చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నామని పవన్ వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మరింత బాధ్యతగా ఉంటామన్నారు. అప్పుడైనా ఇప్పుడైనా బాధ్యతతోనే పర్యటనలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.