2025-02-06 06:28:47.0
రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు సెస్‌లు, సర్‌ఛార్జీలపై పునఃపరిశీలించాలని ఎక్స్ వేదికగా కోరిన మాజీ మంత్రి
కేంద్ర సెస్‌లు, సర్ ఛార్జీల పెరుగుదలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 2013-14లో కేంద్ర సెస్‌లు, సర్‌ఛార్జిలు రూ. 1.08 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. ప్రస్తుతం అది రూ. 5.56 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. స్థూల పన్ను ఆదాయంలో 6.53 శాతం నుంచి 10.97 శాతానికి పెరిగిందని చెప్పారు. రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు సెస్‌లు, సర్‌ఛార్జీలపై పునఃపరిశీలించాలని కోరారు.
సీఎం సొంత నియోజకవర్గంలోనే ఈ దుస్థితి
సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే మధ్యాహ్న భోజన పథకం బాగా లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రొడ్డెక్కే పరిస్థితి ఉన్నదని ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని హరీశ్‌రావు మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని తీరు ఎలా ఉందో కోస్గి ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూస్తే తెలిసిపోతుందని విమర్శించారు.
Harish Rao’s concern,On Union Government’s cess,surcharge,Gross Tax Revenue,States losses substantial revenue