2025-01-08 15:43:40.0
కేఎఫ్ బీర్ల నిలిపివేతపై యునైటెడ్ బ్రూవరీస్ తీసుకున్న నిర్ణయం పలు ప్రశ్నలు లేవనెత్తుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కేఎఫ్ బీర్ల నిలిపివేతపై తమకు పలు అనుమానాలున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీర్లకు సంబంధించి యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటనపై ఆయన ట్వీట్టర్ వేదికగా స్పందించారు. బీర్లకు సంబంధించిన బకాయిలను బెవరేజెస్ కార్పొరేషన్ చెల్లించలేదని యునైటెడ్ బ్రూవరీస్ పేర్కొందన్నారు. దీంతో రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హీనెకెన్ వంటి ప్రీమియం బ్రాండ్ల లభ్యతకు అంతరాయం కలుగుతుందని భావిస్తున్నారని పేర్కొన్నారు. బూంబూం, బిర్యానీ వంటి స్థానిక బ్రాండ్ల బీర్లను ప్రోత్సహించేందుకు ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమా? అని అనుమానం వ్యక్తం చేశారు.
బిల్లుల చెల్లింపులో వరుస క్రమాన్ని కాకుండా ప్రత్యేక ప్రాధాన్యతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందా అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో బూమ్ బూమ్, బిర్యానీ బీర్లు తీసుకురావడానికే ఉద్దేశపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. నిజంగానే ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేయలేదా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా బీర్ల సరఫరా నిలిపివేస్తామని యూబీఎల్ ప్రకటించడంపై ప్రభుత్వం మండిపడింది.
KF Beers,Former Minister Harish Rao,Beverages Corporation,Kingfisher,Heineken,United Breweries,CM Revanth reddy,MinisterJupally Krishna Rao