https://www.teluguglobal.com/h-upload/2025/01/15/1394602-kejriwal.webp
2025-01-15 03:59:32.0
మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేంద్రం చర్యలు
మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను విచారించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి అనుమతి ఇచ్చింది. ప్రజాప్రతినిధుల్ని విచారించడానికి ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్ లో ఆదేశించింది. ఈ మేరకు తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేజ్రీవాల్‌ను విచారించడానికి అనుమతి ఇవ్వడంతో కేంద్రం చర్యలు తీసుకున్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
Centre grants approval,ED to prosecute,Arvind Kejriwal,Delhi liquor policy case