కేజ్రీవాల్‌, ఆతిశీ, మనిశ్‌ సిసోడియా వెనుకంజ

2025-02-08 03:21:23.0

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో దూసుకుపోతున్న బీజేపీ ఆప్‌ 17, బీజేపీ 29, కాంగ్రెస్‌ 1 చోట్ల ఆధిక్యం

https://www.teluguglobal.com/h-upload/2025/02/08/1401449-screenshot-2025-02-08-085054.webp

దేశ రాజధానిలో నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆప్‌.. ఆపార్టీని గద్దెదించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఢిల్లీ పాలనా పగ్గాలు దక్కించుకోవాలన్న కసితో బీజేపీ ఉన్నాయి. ఈ రెండింటిలో దేనిది పై చేయి కానున్నదో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌటింగ్‌ మొదలైంది. పోస్టల్‌ బ్యాలెట్‌ లో ఆప్‌-బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం జంగ్‌పురలో మనీశ్‌ సిసోడియా, న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్‌, కాల్‌కాజీ స్థానంలోల ఢిల్లీ సీఎం ఆతిశీ వెనుకంజలో ఉన్నారు. షాకుర్‌ బస్తీలో ఆప్‌ అభ్యర్థి సత్యేంద్ర కుమార్‌ జైన్‌, ఓక్లా స్థానంలో ఆప్‌ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్‌, గాంధీ నగర్‌లో బీజేపీ అభ్యర్థి అర్విందర్‌ సింగ్‌ లవ్లీ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ఆప్‌ 17, బీజేపీ 29, కాంగ్రెస్‌ 1 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Delhi Results 2025,ECI begins counting,AAP,BJP,Congress,Kejriwal,Atishi,Manish Sisodia