2025-01-08 09:56:27.0
ఎన్నికల హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ రావు అన్నారు.
ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ కోసమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల దృష్టి మళ్లించడానికి లగచర్ల ఇష్యూ.. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇప్పుడు రైతు భరోసా ఇస్తాం అంటున్నారని హరీష్ రావు అన్నారు. ఒక్కసారి ఇస్తారేమో.. కానీ, ఎన్నికల తర్వాత అసలు ఇవ్వరు. పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హామీలను ఆ ప్రభుత్వం నిలబెట్టుకుంది. అధికారంలోకి రాగానే మహిళలకు 4వేలు ఇస్తున్నారు.
ఇక్కడ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు పెడుతున్నారు. ప్రశ్నించినందుకే కేటీఆర్ పై కేస్ లు పెట్టారు అప్పుల పై అడ్డగోలుగా మాట్లాడితే అసెంబ్లీ లో నిజాలు నిరూపించాం. ఇంకా మా పై తప్పుడు మాటలు మాట్లాడితే లీగల్ గా వెళ్తాము. లగచర్ల రైతుల కోసం, ఏ కార్యకర్తలకు ఆపద వచ్చినా కేటీఆర్ అండగా నిలబడ్డారు. ఇప్పుడు కేటీఆర్ మీద కేసు పెట్టినా పార్టీ క్యాడర్ అంతా అండగా ఉంటుంది అని హరీష్ రావు పేర్కొన్నారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి 40 వేల కోట్లు మాత్రమే అప్పులు చేశామని, కానీ కాంగ్రెస్ ఏడాదికి లక్షా 40 వేల కోట్లు అప్పు చేసిందని అన్నారు. లగచర్ల గిరిజన రైతులకు అండగా కేటీఆర్ నిలబడ్డారని, కేటీఆర్ కు ఆపద వస్తే పార్టీ మొత్తం అండగా నిలబడుతుందని, రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతుంది కాబట్టే కేటీఆర్ పై కేసు పెట్టారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy,Telangana Bhavan,Formula E-Race Case,Congress Government,Congress party,BRS,KCR,ACB,Supreme Court,Advocate Prabhakar Rao,AAG,Lunch Motion Petition,Harish Rao,Lagacharla,Rythu Bharosa