2025-01-08 09:33:33.0
ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఏసీబీ విచారణకు కేటీఆర్ లాయర్‌ను తీసుకెళ్లేందుకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. కేటీఆర్ వెంట వెళ్లేందుకు ముగ్గురు న్యాయవాదుల పేర్లను సూచించాలని కోర్టు అడిగింది. ముగ్గురిలో ఒకరిని కేటీఆర్ వెంట వెళ్లేందుకు అనుమతిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా.. కేటీఆర్‌తో న్యాయవాదిని అనుమతించాలని అడ్వకేట్ ప్రభాకర్ రావు వాదించారు. గతంలోనూ లాయర్ అనుమతికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని కేటీఆర్ న్యాయవాది ప్రభాకర్ రావు గుర్తు చేశారు.
అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా ఇదే హైకోర్టు న్యాయవాదికి అనుమతి ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏసీబీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతించొద్దంటూ అదనపు అడ్వకేట్ జనరల్ వాదించారు. న్యాయవాదిని అనుమతిస్తే సమస్య ఏంటని ఏఏజీని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏసీబీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రంజిత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ న్యాయవాదిని అనుమతించవద్దని కోర్టును కోరారు. లాయర్‌ను అనుమతిస్తే తప్పేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. నిందితుడు, అధికారి ఒక గదిలో ఉంటే వాళ్లు కనిపించే దూరంలో న్యాయవాది మరో గదిలో ఉంటారని చెప్పారు. దర్యాప్తు అధికారి, పిటిషనర్ కనిపించే విధంగా ఏసీబీ కార్యాలయంలో ఏర్పాట్లు ఉన్నాయా అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది.
CM Revanth Reddy,Telangana Bhavan,Formula E-Race Case,Congress Government,Congress party,BRS,KCR,ACB,Supreme Court,Advocate Prabhakar Rao,AAG,Lunch Motion Petition,Tera Ranjith Reddy