2025-01-14 03:50:00.0
గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసాల వద్ద భారీగా మోహరించిన పోలీసులు
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆందోళనలు జరగకుండా పోలీసులు ఈమేరకు చర్యలు చేపట్టారు. పాడి కౌశిక్ రెడ్డిని సోమవారం కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారిన విషయం విదితమే. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో 10 టీవీ న్యూస్ ఛానల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా 35 మంది పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తీసుకెళ్లారు.
మరోవైపు కౌశిక్ రెడ్డిని అర్ధరాత్రి దాటాక ఒంటిగంటకు అరెస్ట్ చూపించారని బీఆర్ఎస్ లీగల్ టీం మీడియాతో చెప్పింది. ఎలాగైనా కౌశిక్ రెడ్డిని రిమాండ్ చేయాలనుకుంటున్నారు. ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళకుండా పీఎస్ కే వైద్యులను పిలిపించారని తెలిపింది. సెక్షన్ 31, 32 కింద అరెస్ట్ చేసినట్లు చెప్పారు..ఈ రెండు కేసుల్లోనైతే బెయిల్ రావాలి.41 సీఆర్పీసీకి విరుద్ధంగా రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపించిందని పేర్కొన్నది.
KTR,Harish Rao House arrest. MLA Padi Kaushik Reddy Arrest,MLA Sanjay Kumar,Karim Nagar Collectorate,Three Cases,Karim Nagar Police