కేబినెట్‌ సమావేశం ప్రారంభం

2025-01-04 11:58:43.0

పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం

తెలంగాణ కేబినెట్‌ సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. సెక్రటేరియట్‌ ఆరో ఫ్లోర్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రైతులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రైతుభరోసా విధివిధానాలు ఖరారు చేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపైనా నిర్ణయం ప్రకటించనున్నారు. రేషన్‌ కార్డుల జారీపైనా నిర్ణయం తీసుకోనున్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం పంపిణీపై విధివిధానాలు ప్రకటించనున్నారు. రెండు విడతల్లో కూలీలకు రూ.6 వేల చొప్పున పంపిణీ చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో రైతుభరోసా కింద ఒక్కో ఎకరానికి ఒక్కో సీజన్‌కు రూ.7,500 చొప్పున రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. నిధుల కొరతతో ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున ఇస్తూ నిర్ణయం ప్రకటించే అవకాశముంది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ప్యాకేజీలు 2, 3కు సంబంధించిన ఎస్కలేషన్‌ ప్రపోజల్స్‌ కు ఆమోదం తెలిపే అవకాశముంది. నార్లాపూర్‌ పంపుహౌస్‌ తో పాటు అక్కడి నుంచి నీటిని తరలించే టన్నెల్‌, గ్రావిటీ కాలువలు పూర్తి చేసేలా ఎస్కలేషన్‌ ప్రతిపాదనలు ఆమోదించనున్నట్టు తెలిసింది.

Telangana Cabinet,Raithu Bharosa,Ration Cards,Indiramma Houses,Revanth Reddy