https://www.teluguglobal.com/h-upload/2024/05/22/500x300_1329619-brain-eating.webp
2024-05-22 07:18:53.0
కేరళకు చెందిన ఓ ఐదేళ్ళ బాలిక వారం రోజులుగా చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆ చిన్నారి అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ ‘అమీబిక్ మెనింగోన్సిఫాలిటీస్’ (బ్రెయిన్ ఈటింగ్ అమీబా) వ్యాధితో మరణించడంతో మరోసారి బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి చర్చ మొదలయ్యింది.
కేరళకు చెందిన ఓ ఐదేళ్ళ బాలిక వారం రోజులుగా చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆ చిన్నారి అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ ‘అమీబిక్ మెనింగోన్సిఫాలిటీస్’ (బ్రెయిన్ ఈటింగ్ అమీబా) వ్యాధితో మరణించడంతో మరోసారి బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి చర్చ మొదలయ్యింది.
అసలేం జరిగిందంటే కేరళకు చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి మూన్నియూర్ పంచాయతీకి చెందిన చిన్నారి కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ లో తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులతో చేరింది. అయితే పరీక్షలు చేసిన వైద్యులు ఆమె మెదడులోకి నాన్-పారాసిటిక్ అమీబా ప్రవేశించినట్టుగా తెలుసుకునారు.
పాప తల్లిదండ్రులను ప్రశ్నించగా మే 1 వ తేదీన తమ కుమార్తె బంధువులతో కలిసి సమీపంలోని చెరువులో స్నానం చేసిందని, అయితే మే 10వ తేదీ నాటికి జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయని తెలిపారు. దీంతో కలుషితమైన ఆ నీటిలో ఉన్న ఫ్రీ లివింగ్ అమీబా ఆమె ముక్కుగుండా శరీరంలోకి వెళ్లి మెదడుపై తీవ్ర ప్రభావం చూపించినట్టు వైద్యులు గుర్తించారు. వ్యాధిని సకాలంలో కుటుంబ సభ్యులు గుర్తించకపోవడం, వైద్య చికిత్స అందించడంలో అప్పటికే ఆలస్యం కావడంతో బాలిక చనిపోయినట్లు వైద్య నిపుణులు వెల్లడించారు.

బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ?
ఇది పరాన్నజీవి కానటువంటి బ్యాక్టీరియా వర్గానికి చెందిన ఒక రకమైన అమీబా. కలుషితమైన నీటిలో స్వేచ్చగా జీవించే ఈ అమీబా. ముక్కు లేదా నోటిద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడును క్రమక్రమంగా పనిచేయకుండా చేస్తుంది. అందుకే దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబా గా పిలుస్తారు.
ఈ వ్యాధి సోకినవారికి ముందుగా తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు అవుతాయి. ఈ జీవి మెదడును తన ఆహారంగా భావించి అక్కడి కీలక ప్రాంతాలపై దాడి చేయడం వల్ల నాడీ వ్యవస్థా దెబ్బతింటుంది. వెంటనే గుర్తించి వైద్యం అందించకపోతే బాధితులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కేరళలో గతంలో 2017లో ఇకసారి, 2023లో మరోసారి ఈ కేసులు బయటపడ్డాయి.
Brain Eating Amoeba,Kerala,infection,Malappuram
Brain-Eating Amoeba, Kerala, Kerala News, Kerala brain-eating amoeba, brain-eating amoeba in Kerala, telugu news, telugu global news, infection, Malappuram, what is brain eating amoeba
https://www.teluguglobal.com//health-life-style/five-year-old-girl-from-malappuram-in-kerala-dies-of-infection-from-brain-eating-amoeba-1032782