కేవలం రూ.2 లక్షల ధరతో అద్భుతమైన ఫీచర్లతో నానో ఎలక్ట్రిక్ కారు?

2024-11-14 13:39:47.0

కేవలం 2.5 లక్షల నుంచి 8 లక్షల మధ్య బేసిక్ ధరతోనే టాటా నానో ఎలక్ట్రిక్ వెహికిల్‌ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ కానుంది

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ఆదా చేసుకోవడంతో పాటు, కాలుష్యం లేకుండా, నడపడం కూడా ఈజీగా ఉండటంతో అందరూ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే.. వాహన రంగంలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న టాటా మోటార్స్, టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ ఈ డిసెంబర్‌లో ఇండియన్ మార్కెట్లోకి రాబోతున్నట్లు టాక్ ఈ సందర్భంగా టాటా నానో ఈవీ కారు ధర, ఫీచర్లు, ఇతర విశేషాలు తెలుసుకుందాం..

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. అన్ని ప్రముఖ కంపెనీలు ఈవీలపై ఫోకస్ పెట్టాయి.ఈ క్రమంలో కేవలం 2.5 లక్షల నుంచి 8 లక్షల మధ్య బేసిక్ ధరతోనే టాటా నానో ఎలక్ట్రిక్ వెహికిల్‌ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అవుతున్నట్లు సమాచారం. టాటా నానో ఈవీ బేస్ వేరియంట్ ధర రూ.2.5 లక్షలతో ప్రారంభం కానున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక హైఎండ్ ఫీచర్స్‌తో కూడిన టాప్ వేరియంట్ ధర రూ.8 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం.అయితే.. ధరపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. రతన్ టాటా కలల కారుగా వస్తున్న ఈ టాటా నానో ఈవీ.. వాహన రంగంలో సరికొత్తఒరవడిని తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సిటీ డ్రైవింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ కారును డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తక్కువ ధర, స్టైల్, కంఫర్ట్ విషయంలో కాంప్రమైస్ కాకుండా ఈ ఈవీ కారు మార్కెట్‌లోకి రానుంది.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. టాటా నానో ఈవీ ఒక కాంపాక్ట్ కారు. అద్భుతమైన డిజైన్‌తో వస్తున్న ఈ కారు పొడవు 3,164mm, వెడల్పు 1,750mm, వీల్ బేస్ 2,230mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180mmగా ఉండనుందని సమాచారం.దీంతో పాటు.. 7- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, పవర్‌ఫుల్ 6- స్పీకర్ సౌండ్సిస్టమ్,పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ వంటి ఫీచర్లన్నీ ఇందులో ఉండనున్నాయంట. ఏసీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ లాంటి ఫీచర్లు కూడా పొందుపరచనున్నట్లు సమాచారం.టాటా సంస్థ 2008లో కేవలం లక్ష రూపాయల ధరకే నానో కారును మార్కెట్లోకి విడుదల చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే.. సుదీర్ఘ పోరాటం, సవాళ్ల కారణంగా కంపెనీ 2018లో టాటా నానో ఉత్పత్తిని నిలిపివేయవలసి వచ్చింది. ఆ తర్వాత టాటా నానో కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌పై దృష్టి సారించింది.

electric car,Tata Motors,Tata Nano electric vehicle,Tata Nano EV car,Power steering,power windows,electronic brakeforce