కేసీఆర్‌ తో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర భేటీ

2025-01-03 14:17:04.0

నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ సభ్యుడు

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర భేటీ అయ్యారు. శుక్రవారం ఎర్రవెల్లి ఫాం హౌస్‌ లో కేసీఆర్‌ ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఎంపీ వెంట బీఆర్ఎస్ నాయకుడు జెన్నాయికోడే జగన్మోహన్ ఉన్నారు.

KCR,BRS,MP Vaddiraju Ravichandra,New Year Greetings