2025-02-16 11:54:07.0
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి తలసాని తెలిపారు.
గులాబీ దళపతి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రేపు ఫిబ్రవరి 17న కేసీఆర్ బర్త్ డే వేడుకలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో భారీగా నిర్వహించేందుకు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించిన పనులను మాజీ హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన స్వయంగా పర్యవేక్షించారు. రేపు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో.. పట్టణాలు, గ్రామాల్లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలియ జేశారు.
ఆలయలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు నిర్వహిస్తామని.. విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా 71 కిలోల భారీ కేక్ కటింగ్ చేస్తామని.. వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు , ఎమ్మెల్సీ కవిత, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీశ్రేణులు హాజరవనున్నారని తెలిపారు. అదే విధంగా కేటీఆర్ పిలుపు మేరకు రేపు రాష్ట్రవ్యాప్తంగా వృక్షార్చన పేరుతో ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటే భారీ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహస్తామని పేర్కొన్నారు.
KCR’s birthday celebrations,BRS Party,KCR,KTR,MLC Kavitha,Telangana Bhavan,Former Home Minister Mahmood Ali,Former Minister Harish Rao