2024-12-24 06:32:59.0
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు లకు హైకోర్టులో ఊరట లభించింది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు సస్పెండ్ చేసింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరిగా లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు క్రిమినల్ రివిజన్ పిటిషన్ విచారణ చేపట్టింది. దీనిని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. ఈ అంశంలో జిల్లా కోర్టుకు విచారణ పరిధి లేదని కేసీఆర్, హరీశ్ రావు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ మేరకు హైకోర్టు, సుప్రీంకోర్టు సైతం తీర్పులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు జడ్జి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.
Former CM KCR,Former Minister Harish Rao,High Court,Medigadda Barrage Pillar,Bhupalapally District Sessions Court,Supreme Court,BRS Party,KTR,CM Revanth reddy,Rajalingamurthy