2025-01-27 16:21:07.0
ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసల పునరుద్ధరణకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడి
కైలాస మానస సరోవర్ యాత్రను ఈ ఎండాకాలంలో పునఃప్రారంభించాలని భారత్, చైనాలు సంయుక్తంగా నిర్ణయించాయి. దీంతోపాటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసల పునరుద్ధరణకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య పౌర సంబంధాలు పెంపొందించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. చైనా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీతో భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
India,China,Agree,Resume Kailash Mansarovar Yatra,Give ‘in principle’,Direct flights