కొండా సురేఖకి షాక్..కోర్టులో నాగార్జున పరువునష్టం దావా

 

2024-10-03 11:56:34.0

https://www.teluguglobal.com/h-upload/2024/10/03/1365703-surekha123.webp

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు.

మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా మంత్రి వ్యాఖ్యలు చేసిందంటూ నాంపల్లి కోర్టులో క్రిమినల్ మరియు పరువు నష్టం కేసు వేసిన హీరో నాగార్జున. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సమంత, నాగచైతన్య విడాకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వల్లనే అయినవి అని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అక్కినేని ఫ్యామిలీ, సమంతతో సహా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. హీరోయిన్లపై సురేఖ మాట్లాడిన తీరును చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున తదితర ప్రముఖులు ఖండించారు.

 

Minister Konda Surekha,KTR,Nagarjuna,Naga Chaitanya,Samantha,Nampally Court,Defamation suit