2024-10-02 13:58:51.0
https://www.teluguglobal.com/h-upload/2024/10/02/1365472-konda-murali.webp
కొందరు తమ సొంత మైలేజ్ కోసం నటి సమంత పేరును వాడుకుంటున్నారంటూ నాగచైతన్య-సమంత డైవర్స్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి పరోక్షంగా స్పందించారు.
కొందరు తమ సొంత మైలేజ్ కోసం నటి సమంత పేరును వాడుకుంటున్నారంటూ నాగచైతన్య-సమంత డైవర్స్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గాయనీ చిన్మయి పరోక్షంగా స్పందించారు. సామ్ విషయంలో మంత్రి కామెంట్స్‌ను ఖండించారు. యూట్యూబ్ ఛానళ్లు, మీడియా సంస్థల తీరునూ ఆమె తప్పుబడ్డారు. వ్యూస్, లైక్స్, పైసాలు కోసం ఇలా చేయడం బాధాకరమన్నారు. తాజా నటి హేమ కూడా స్పందించింది.
మిగతా రంగాల్లో పనిచేసే ఆడవారికి ఎలా అయితే గౌరవం ఇస్తున్నారో.. సినిమా రంగంలో ఉన్న ఆడవారికి కూడా గౌరవం ఇవ్వాలని ఆమె అన్నారు. సినిమా రంగంలో ఉన్న ఆడవారికి కూడా ఆత్మగౌరవం ఉంటుందని వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమలోని మహిళలకు కూడా గౌరవం ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.సమంత, నాగచైతన్య విడిపోవడానికి కూడా కేటీఆరే కారణమని సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే
Singer Chinmai,Minister Konda Surekha,Samantha,Naga Chaitanya,Social media,Actress Hema